రామ్ చరణ్‌కి వాయిదాల పరంపర...జంజీర్ పాటలు రావడం లేదు!

సోమవారం, 19 ఆగస్టు 2013 (13:47 IST)
FILE
రామ్‌ చ‌ర‌ణ్‌కి ఇప్పుడు వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఈమ‌ధ్య చెర్రీకి ఏమీ క‌ల‌సి రావ‌డం లేదు. అనుకొన్న స‌మ‌యానికి సినిమాలు రావటం లేదు సరికదా ఆడియో కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కావడం లేదు. రామ్‌ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన బాలీవుడ్ చిత్రం జంజీర్‌ తెలుగులో తుఫాన్‌‌గా రాబోతోంది.

ఈ సినిమా ఆడియోను ఈనెల 20న విడుద‌ల చేస్తార‌ని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ ఆడియో కార్యక్రమం వాయిదా వేస్తున్నారని చెబుతున్నారు. ఈ సినిమా సెప్టెంబ‌రు 6న వ‌స్తోంది. ఈ తేదీలో మాత్రం మార్పులేదని చిత్రబృందం అంటోంది. అప్పటికి రాష్ట్రంలో ఎలాంటి వాతార‌వ‌ణం ఉన్నా, సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న స‌మ‌యానికే విడుద‌ల చేయాల‌ని చిత్రబృందం భావిస్తోంది. అదొక్కటే మెగా అభిమానుల‌కు ఊర‌టనిచ్చే విష‌యం.

వెబ్దునియా పై చదవండి