'తలైవా' సినిమాతో విజయ్‌కు పడిపోయిన అమలాపాల్...!

సోమవారం, 26 ఆగస్టు 2013 (12:59 IST)
FILE
తమిళ హీరో విజయ్ నటింటిన 'తలైవా' సినిమా అన్నీ అడ్డుంకులను దాటుకొని విడుదలై విజయం దిశగా దూసుకుపోతోంది. తెలుగులో అన్నగా ఈ సినిమా వచ్చించి. ఈ సినిమాలో విజయ్ సరసన మల్లూ బేబీ అమలాపాల్ నటించింది. అమలాపాల్‌కి ఇప్పుడు విజయ్ నిజమైన హీరోలా కనిపిస్తున్నాడు. తన వ్యక్తిత్వంతో ఈ చిన్నదాని మనసు దోచుకున్నాడు.

'తలైవా' సినిమా ఆయనతో నటించడం తన జీవితంలో ఓ అద్భుతమని అమలా అంటోంది. ఆ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు తాను పొందిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని చెప్పింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం వుండదు. కేవలం పాటలకి, గ్లామర్‌కి ఉపయోగించుకుంటారు.

అయితే, 'తలైవా'లో నాకు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. అది కేవలం విజయ్ వల్లే సాధ్యపడింది. ఆ పాత్ర పోషణలో ఆయన ఎన్నో మెళకువలు నేర్పారు. వృత్తి పట్ల ఎంతో డెడికేషన్ వున్న నటుడాయన" అంటూ విజయ్‌ని తెగ పొగిడేస్తోంది అమలా.

వెబ్దునియా పై చదవండి