జైలులో రామ్ చరణ్ 'జంజీర్' ప్రీమియర్ షో..!!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (08:40 IST)
FILE
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ అరంగేట్రం మూవీ జంజీర్ సినిమాను జైలులో ప్రమియర్ షో వేయనున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా ప్రియాంక చోప్రా నటించింది. ఒక ముఖ్య పాత్రలో సంజయ్ దత్ నటించాడు. ప్రస్తుతం సంజయ్ దత్ జైలులో ఉండటంతో ఆయన కోసం జైలులో జంజీర్ ప్రీమియర్ షో వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పూణే లోని ఎరవాడ జైలులో ఉన్నందున అక్కడ ఈ ప్రీమియర్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే, ఇందుకు జైలు అధికారుల అనుమతి అవసరం. అందుకోసం చిత్ర నిర్మాతలు దరఖాస్తు కూడా చేశారు. మరి, అనుమతి వస్తే తొలిసారిగా జైలులో ప్రీమియర్ షో ఏర్పాటైన ఘనత ఈ 'జంజీర్' సినిమాకు దక్కుతుంది. సెప్టెంబర్ 6న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి