'క్రిష్-3'లో అమితాబ్ బచ్చన్ గళం..!

మంగళవారం, 27 ఆగస్టు 2013 (09:41 IST)
FILE
బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తన గంభీరమైన గాత్రాన్ని ఓ సినిమాలో వినిపించనున్నారు. హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న 'క్రిష్ 3' హిందీ చిత్రానికి అమితాబ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు.

ఈ సినిమాలో కొన్ని కీలకమైన సన్నివేశాలలో అమితాబ్ వాయిస్ వినిపిస్తుందనీ, ఆయన వాయిస్ అయితేనే అలాంటి సన్నివేశాలు రక్తికడతాయన్న ఉద్దేశంతో అమితాబ్ చేత చెప్పించారనీ అంటున్నారు. పొతే, ఇటీవల రిలీజయిన ఈ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో కొట్లలో వ్యూస్ పొంది సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. ప్రియాంకా చోప్రా, వివేక్ ఓబెరాయ్, కంగనా రనౌత్ ఇందులో ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి