ప్రియమణి 'చండీ' బూతుకు లొంగిపోయింది...!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (13:59 IST)
FILE
కుర్రకారును తన కొంగుకు కట్టేసుకునే కులుకులు.. జాతీయస్థాయిలో ఉత్తమ నటన ప్రదర్శించగల ప్రతిభాపాటవాలు.. రెండూ పుష్కలంగా కలిగిన ప్ర్రియమణి క్రేజ్ సినిమా సినిమాకు పడిపోతోంది. ఒక్క యమదొంగ మినహా ఆమెకు తెలుగులో చెప్పుకోదగ్గ హిట్టు మరొకటి లేదు. దాంతో ఇక లాభం లేదనుకుందో ఏమో కానీ.. ఇప్పుడు వరుసగా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తోంది ప్రియమణి.

ప్రియమణి టైటిల్ పాత్ర పోషిస్తున్న చండీతోపాటు అంగుళీక అనే మరో చిత్రం కూడా ప్రస్తుతం సెట్స్పై ఉంది. ఈ రెండు చిత్రాలూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలే. ఈ రెండు చిత్రాలపై ప్రియమణి చాలా ఆశలు పెట్టుకుంది. ఈ నేపధ్యంలో చండీ మూవీ రిలీజ్‌కు ముందే ప్లాప్ టాక్‌ను కైవ‌సం చేసుకుంది.

తాజాగా రిలీజ్ అయిన చంఢీ టీజ‌ర్‌లో ప్రియ‌మ‌ణి చేత బూతు డైలాగుల‌ను చెప్పించారు. నాతో పెట్టుకుంటే బాక్స్ బ‌ద్దల‌వుతుంది, క‌ట్ చేస్తే ప‌నికిరాకుండా పోతావ్ అనే బోల్డ్ డైలాగ్‌లు ప్రియ‌మ‌ణి నోటి వెంట వింటానికి కొంచెం ఎబ్చెట్టుగా మారాయి. ప్రియ‌మ‌ణికు వ‌చ్చిన క‌ష్టాలను చూసి సినిపెద్దలు కొందరి లైఫ్ అంతే అంటూ లైట్ తీసుకుంటున్నారు.

వెబ్దునియా పై చదవండి