హృతిక్‌తో విడాకులుపై ఎవరినీ నిందించాల్సిన పనిలేదు: సుజానే

గురువారం, 19 డిశెంబరు 2013 (16:07 IST)
IFM
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుజానే‌లు ఇటీవల విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరూ విడిపోవడంపై మీడియాలో రకరకాలుగా కథనాలు వచ్చాయి. బాలీవుడ్ హీరో అర్జున్ రాంపాల్‌తో సుజానా సన్నిహితంగా ఉంటున్నారంటూ, అత్తమామతో విభేదాలు కారణంగా సుజానే తన భర్తనుంచి విడిపోవాలని డిసైడయ్యిందని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఈ వార్తలపై సుజానే స్పందించింది. ''తాను, తన భర్త హృతిక్ రోషన్ విడిపోవడంపై ఎవరినీ నిందించాల్సిన పనిలేదని ఆమె స్పష్టం చేసింది. ఒక తల్లిగా, ఒక మంచి వ్యక్తిగా ఇలాంటి వార్తలపై మాట్లాడానని సుజానే చెప్పారు. అర్జున్ మంచి స్నేహితుడన్నారు. తాను, హృతిక్ విడిపోవడానికి కారణం ఏమీలేదని, ఒక్కోసారి పరిస్థితులు అలా ఎదురవుతాయంటూ వేదాంత ధోరణిలో మాట్లాడారు. ముంబైలో ఒక స్టోర్ ప్రారంభం సందర్భంగా ఆమె తన అభిప్రాయాలను ఇలా పంచుకున్నారు. అర్జున్ రాంపాల్ కూడా తనపై వస్తున్న కథనాలను తప్పుబట్టిన విషయం తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి