శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సినీ నటి అంకిత తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించారు. యువ హీరోలు తన వైపు చూడకపోవడం, పెద్ద హీరోలు కూడా కొత్త ముఖాల కోసం వెతుకుతుండటంతో సినీ నటి అంకిత మాత్రం పెళ్లి సన్నాహాల్లో పడింది.
పెళ్లి సంబంధాలు కుదరట్లేదో ఏమో కానీ బుధవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి ప్రత్యేకంగా రాహుకేతు పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తాను అమెరికాలో చదువుకుంటున్నానని, అలాగే పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నానని తెలిపింది.
శ్రీకాళహస్తీశ్వరుని ఆశీస్సులతోనైనా తనకు పెళ్లి జరుగుతుందనే ఆశతో రాహుకేతు పూజలు చేయించుకున్నానని తెలిపింది. పెళ్లి తర్వాత సినిమాల్లో నటించాలా? వద్దా? అనేది తర్వాత చెబుతానని అంకిత తెలిపింది. 'ఐ లవ్యూ రస్నా' అంటూ అందర్నీ అలరించిన అంకిత 'లాహిరిలాహిరిలో' సినిమాతో హీరోయిన్ గా మారిన సంగతి తెలిసిందే.