కొత్తజంట అలా ఉండదు... నన్ను నమ్మండి అంటున్న మారుతి..

బుధవారం, 19 మార్చి 2014 (21:30 IST)
WD
బూతు చిత్రాల దర్శకుడిగా పేరుపొందిన మారుతి.. ఇప్పుడు అతను ఏ చిత్రం చేసినా..అదే బాపతు అనుకుంటున్నారు. ఇటీవలే హీరో నితిన్‌ కూడా ఆయనై సెటైర్‌ వేశాడు. యూతు పేరుతో బూతు చిత్రాలు తీస్తున్నాడు. దాన్నుంచి బయటపడాలని సభలోనే ఆయన ఉన్నప్పుడే అన్నాడు. మారుతికి పెద్ద షాక్‌ ఇచ్చాడని ఇండస్ట్రీ భావించింది. అందుకేనేమో ఇప్పుడు మారుతి మాటలు మారిపోయాయి. తాజాగా ఆయన అల్లు శిరీష్‌తో 'కొత్తజంట' చేశాడు. అందులో చిరంజీవి చిత్రంలోని రీమిక్స్‌ సాంగ్‌ చేశాడు.

'ఖైదీ నెం.786' చిత్రంలోని 'అటు అమలాపురం.. ఇటు పెద్దాపురం..' సాంగ్‌ని రీమిక్స్‌ చేస్తున్నారు. అల్లు శిరీష్‌, మధురిమల కాంబినేషన్‌లో గణేష్‌ మాస్టర్‌ పర్యవేఓణలో ఈ పాట చిత్రీకరణ అద్భుతంగా చిత్రీకరించామని 'కొత్త జంట' దర్శకుడు మారుతీ తెలియజేస్తున్నారు. గీతా ఆర్ట్స్‌ బేనర్‌పై అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నివాసు నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం షూటింగ్‌ పూర్తిచేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది. ఈ నెలాఖరులో ఆడియోను వచ్చే నెలలో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ఇది లవ్‌, ఎమోషన్‌, కామెడీ కలిపిన క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ అని ధైర్యంగా చెబుతున్నాను.

నన్ను నమ్మండి. నా గత చిత్రాల మాదిరిగా కాకుండా ఇంటిల్లిపాదీ హ్యాపీగా వచ్చి కొత్తజంట చిత్రాన్ని చూస్తారు. శిరీష్‌, రెజినాల మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి. ప్రేమకథాచిత్రమ్‌ కంటే రెండింతలు కామెడీ ఈ చిత్రంలో ఉంటుంది అంటున్నారు.

వెబ్దునియా పై చదవండి