ఆది ''ప్యార్ మే పడిపోయానే'' సాంగ్స్ రిలీజ్!

గురువారం, 17 ఏప్రియల్ 2014 (11:11 IST)
PR
యంగ్ హీరో ఆది, శాన్వి జంటగా నటిస్తోన్న ''ప్యార్ మే పడిపోయానే'' చిత్రానికి సంబంధించిన పాటలు తాజాగా హైదరాబాద్‌లో విడుదల చేశారు. సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై, రవి చావలి దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ ఈ చిత్రానని రూపొందిస్తున్నారు. ఈ ఆడియో సీడీని మంచు మనోజ్ విడుదల చేసి తొలి కాపీని సాయికుమార్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ... నా 'పోటుగాడు' సినిమాలోని పాటను ఈ సినిమాకు టైటిల్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు సాయికుమార్‌గారు చాలా స్పెషల్. ఈ సినిమా ఆదికి పెద్ద సక్సెస్ కావాలి'' అని అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ... 'లవ్‌లీ' తర్వాత నేను చేసిన పూర్తి స్థాయి ప్రేమకథ ఇది. అనూప్ సంగీతం ఇందులో కీలకపాత్ర పోషిస్తుంది. అతనితో నాకిది నాలుగో సినిమా'' అని ఆది చెప్పారు.

సాయికుమార్ మాట్లాడుతూ.. ''రవి చావలి దర్శకత్వంలో నాకు నంది, ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వచ్చాయి. అటువంటి దర్శకునితో ఆది పని చేస్తున్నందుకు చాలా హ్యాపీ. ఈ సినిమా ఆదికి మంచి మలుపు అవుతుంది'' అని పేర్కొన్నారు.

ఆది-శాన్విల కాంబినేషన్‌లో తొలి హిట్ 'లవ్‌లీ' లాగానే ఈ చిత్రం కూడా పెద్ద విజయం సాధించాలని బి.ఎ.రాజు, బి.జయ కోరుకున్నారు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని, త్వరలో సెన్సార్ చేసి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకముందని కె.కె.రాధామోహన్ తెలిపారు.

వెబ్దునియా పై చదవండి