'కిక్' కోసం 40 అంతస్తుల భవనం పైనుంచి దూకిన సల్మాన్ ఖాన్! (ఫోటో)

సోమవారం, 21 ఏప్రియల్ 2014 (16:52 IST)
PR
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తాడు. కష్టపడిపనిచేయడం ఆయన వ్యక్తిత్వం. సాహసాలు చేయడంలో భయపడని వ్యక్తి ఆయన. తాజాగా సల్మాన్ 40 అంతత్తుల భవనం నుంచి దూకి తన గుండె ధైర్యాన్ని ప్రదర్శించాడు.

కిక్ హిందీ రీమేక్‌లో ఓ సన్నివేశం కోసం పోలండ్‌లోనే అత్యంత ఎత్తయిన భవనం ''ప్యాలస్ ఆఫ్ కల్చర్ అండ్ సైన్స్'' పై నుంచి బంగీ జంప్ చేశాడు. డూప్‌తోనే తీయాలని దర్శకుడు అనుకుంటే, కాదు తానే చేస్తానంటూ సల్మాన్ ముందుకు వచ్చాడు. దీంతో ఐదు గంటల పాటు ఈ సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సినిమాలో జాక్విలిన్ ఫెర్నాండెజ్ హీరోయిన్.

వెబ్దునియా పై చదవండి