పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడడానికి నాలుగేళ్ళు పట్టింది: రేణూ దేశాయ్

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (10:43 IST)
FILE
పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడడానికి నాకు నాలుగేళ్ళు పట్టిందని రేణూ దేశాయ్‌ స్పష్టం చేసింది. ఇటీవలే పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీ గురించి ఆమెను ప్రశ్నలు వేస్తే... దానికి నెట్‌లో సమాధానలు చెబుతూ గొప్పగా అతన్ని పొగిడేసింది. పవన్‌ను వ్యక్తిత్వం ఉన్నవాడిగా పేర్కొంది.

అయితే నాలుగేళ్ళుగా సైలెంట్‌గా వున్నా.. ఆమె అన్న వాక్యంలో అర్థం ఏమయైవుంటుందా? అనేది ఇంట్రస్ట్‌ క్రియేట్‌ చేసింది. పవన్‌ నుంచి దూరమయి నాలుగేళ్ళయిందని అర్థం అందులోవుంది. 2011లోనే ఆమెకు విడాకులిచ్చి ఆస్ట్రేలియన్‌ అమ్మాయి అన్నా లెజనోవాని చట్టపరంగా పవన్ వివాహమాడాడు.

ఈ వివాహం ప్రజలకు తెలియకపోయినా.. సన్నిహితుల సమక్షంలో జరుపుకున్నాడు. ఏదిఏమైనా తననుకున్నంది సాధించేవరకు నిద్రపోడదని రేణు చెబుతోంది. ఇప్పటికే మూడు పెండ్లిలు చేసుకున్న పవన్‌ మాటలు... రాబోయే ఎలక్షన్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి