అనుష్క 'రుద్రమదేవి'కి రూ.5 కోట్ల ఆభరణాలు!

శుక్రవారం, 25 ఏప్రియల్ 2014 (12:36 IST)
FILE
పెట్టిన పెట్టుబడికి రాబడి ఉంటేనే సినిమా తీస్తారు. ఒక వేళ రాకపోతే అనుభవం మిగులుతుంది. ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శక నిర్మాతగా అనుష్కతో తీస్తున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో అనుష్క కోసం కొన్ని ఆభరణాలను కొనేశాడు. అవి రోల్డ్‌గోల్డ్‌ అయితే, చర్మానికి ఏదైనా మచ్చలు, దద్దుర్లు వస్తాయనుకున్నారేమో కానీ ఏకంగా ఒరిజిల్‌ గోల్డ్‌ను కొనేసి వాటిని ధరింపజేశాడు.

దాదాపు ఐదుకోట్ల విలువైన ఆభరణాలు ఆమె ధరిస్తుందని తెలుస్తోంది. గుణశేఖర్‌ తన వెబ్‌సైట్‌లో ఈ విషయాలు చెబుతూ.. ఇది పబ్లిసిటీ కోసం చేస్తుందికాదనీ, కథాపరంగా పాత్రపరంగా ఆమె అందాన్ని హైలెట్‌ చేయడం కోసం చేసిందేననీ అంటున్నాడు. నిజంగానే బంగారమయితే, దాన్ని కాపాడుకునేందుకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంటే అది తరిగిపోయేది అరిగిపోయేదికాదు కాబట్టి కొన్నది ఎలాగూ మళ్ళీ తిరిగివస్తుంది. ఒకరకంగా.లాభమేకదా.

వెబ్దునియా పై చదవండి