రామ్ చరణ్ "జగదేకవీరుడు"-జాహ్నవి "అతిలోకసుందరి"

WD
మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి జంటగా నటించిన "జగదేక వీరుడు - అతిలోక సుందరి" ఎంతటి హిట్ సాధించిందో అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్‌గా నిర్మాత అశ్వనీదత్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ, శ్రీదేవి కుమార్తె జాహ్నవితో "జగదేక వీరుడు - అతిలోక సుందరి -2" చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాలీవుడ్ న్యూస్.

కాగా ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలను కె. రాఘవేంద్ర రావు చేపడతారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ద్వితీయార్థంలో నిర్మించనున్నట్లు అశ్వనీదత్ సూచనప్రాయంగా తెలియజేశారు. ఇదిలావుండగా శ్రీదేవి కుమార్తె జాహ్నవి తన తొలి చిత్రాన్ని అక్కినేని నాగచైతన్యతో చేయనున్నట్లు భోగట్టా.

అసలు శ్రీదేవి కుమార్తె సినిమాల్లో నటిస్తుందా లేదా.. అని ఆమె తండ్రి బోనీకపూర్‌ను అడిగితే... మరీ ఇంత చిన్న వయసులోనే తమ కుమార్తె నటిస్తుందని తాననుకోవడం లేదన్నారు. అయితే శ్రీదేవి మాత్రం తాను 10 ఏళ్ల వయసులోనే హీరోయిన్‌గా నటించాననీ, ఆ లెక్కన చూసుకుంటే జాహ్నవికి 13 ఏళ్లు కనుక ఆమెకు హీరోయిన్‌గా నటించే వయసు వచ్చేసిందని చెప్పినట్లు భోగట్టా. మరి జాహ్నవి సరసన నటించేందుకు మగధీర ఏమంటాడో చూడాలి.

వెబ్దునియా పై చదవండి