అనుష్కను బాగా వాడుకుంటున్నారట!!

గురువారం, 14 జులై 2011 (11:41 IST)
బాలీవుడ్ సుందరాంగి అనుష్కను చిత్ర నిర్మాతలు, దర్శకులు, హీరోలు బాగా వాడుకుంటున్నారట. దీనిపై ఈ ముద్దుగుమ్మ తెగ బెంగపడిపోతోంది. తనను బుక్ చేసుకునే దర్శక నిర్మాతలు అన్ని రకాలుగా ఉపయోగించుకుంటున్నారని వాపోతుందట. 

ఇక్కడ ఈ వాడుకోవడం అంటో మరొకలాంటి అర్థం కాదు సుమా. అనుష్క నటించే తాజా చిత్రాల్లో అందచందాలను బాగా చూపిస్తున్నారట. వాటి ద్వారా ఆ చిత్రాలకు మంచి పబ్లిసిటీని పొందుతున్నారని ఆమె వాపోతోంది.

విక్రమ్ హీరోగా నటించిన తాజా చిత్రం "నాన్న" ఈనెల 15వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రంలో అనుష్క అందాలను విచ్చలవిడిగా ఆరబోసినట్టు ప్రచారం సాగుతోంది.

ఇంతకు ఈ చిత్రం విడుదలైతే గానీ ఆమె అందచందాలు ఏమేరకు ఆరబోసిందో గానీ తెలియదు. ఆ తర్వాత దర్శక నిర్మాతలు పడిన కష్టానికి ఫలితం దక్కుతుందో లేక తుస్‌మని పోతుందో వేచి చూడాల్సింది.

వెబ్దునియా పై చదవండి