ఇప్పటివరకూ సంచలనాత్మక చిత్రాలంటే రాంగోపాల్ వర్మ పేరునే చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇపుడా ఇమేజ్‌ను సీనియర్ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ఎగరేసుకెళ్లేట్లు కనబడుతోంది. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని డర్టీ పిక్చర్ తెరకెక్కిస్తూ ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది ఏక్తా.