కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ తమిళంలో 'ఇష్టం' చిత్రంలో నటిస్తోంది. తెలుగులో ఆమె నటించిన 'ఏమైంది ఈ వేళకు' ఇది రీమేక్. ఇందులో విమల్ హీరోగా నటిస్తున్నాడు. నవంబర్‌లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
తమిళ నేటివిటీకి అనుగుణంగా ఈ కథలో పలు మార్పులు చేశారని చెప్పింది. ఆల్రెడీ తెలుగులో చేసిన పాత్రే కనుక బోర్ కొట్టలేదని చెపుతోంది. అయితే తమిళం మాట్లాడానికి కొంచెం కష్టం అనిపించిందనీ చెప్పుకొచ్చింది.
సినిమాలో కిస్ సీన్స్ గురించి అడిగితే... అది మాత్రం ఇప్పుడే చెప్పలేను. ఇంతవరకు ఆ సీన్ గురించి ఆలోచించలేదని తప్పించుకుంది. ఆల్‌రెడీ విడుదలకు దగ్గరపడిన ఈచిత్రంలో తమిళ నేటివిటీ ఎలా చూపిస్తారో చూడాల్సిందే.