సిల్క్‌స్మిత జీవితచరిత్ర ఆధారంగా రూపొందిన చిత్రం "డర్టీపిక్చర్"లో హాట్‌సీన్స్‌లోనూ ఎంజాయ్ చేస్తూ నటించిన విద్యాబాలన్ తన రూటును మార్చలేదు. ఆ చిత్రంపై ఎంత గొడవ జరుగుతుంటే.. అంత పేరు వస్తుందని ముసిముసి నవ్వులు చిలికిస్తుంది.
తాజాగా ఆమె ఓ హిందీ చిత్రంలో నటించేందుకు అవకాశం వచ్చింది. అందులో బికీనీలో నటించడానికి సై అంటూ చెప్పింది. అవసరం మేరకే పాత్ర పరిమితి మేరకే ఆ బికినీ ఉంటుందని చెబుతూ... అందులో వల్గారిటీ అనేది ఏమీ ఉండదని.. ఈత కొడితే బికినీలు కాక మరేమి దుస్తులు వేసుకుంటారని ఎదురు ప్రశ్నిస్తుంది.
ఉదాహరణగా.. వేశ్య పాత్ర వేయాల్సివస్తే.. వేశ్యలాగానే ప్రవర్తించాలి కదా అంటూ కౌంటర్ వేస్తుంది. మరి శృంగార సన్నివేశాల్లో నటించేటప్పుడు కూడా రియల్‌గా చేయాల్సిందే కదా అంటుందేమో మరి.