కష్టాల్లో పూనమ్ పాండే... నషాలో విప్పేసినా నో రిజల్ట్!

బుధవారం, 2 ఏప్రియల్ 2014 (16:01 IST)
FILE
బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే‌కు ఇప్పుడు కష్టాలు వచ్చిపడ్డాయి. నషా సినిమా నిరాశపరచడంతో పూనంకు కష్టాలు మొదలయ్యాయి. నషా సినిమా భారీ హిట్టవుతుందని పూనం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా హిట్‌తో తనకు మంచి అవకాశాలు వస్తాయని భావించింది. కాని నషా ప్లాప్ అవడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు రాలేదు సరికదా వచ్చిన అవకాశాలు కూడా మిస్ అవుతున్నాయి.

నషా సనిమా విడుదల కాకముందు ఈ సినిమా పోస్టర్స్, ఆ సినిమాకు ఉన్న క్రేజ్‌ను చూసి రెండు ప్రాజెక్టులకు పూనంను ఎంపిక చేసుకున్నారు. తీరా ఈ సినిమా ప్లాప్ అవడంతో వారి సినిమాల నుంచి పూనంను తప్పించారు. ఆమెకు అడ్వాన్స్‌గా ఇచ్చిన కోటి రూపాయలను కూడా తిరిగిఇవ్వాలని వారు ఆమెను డిమాండ్ చేస్తున్నారు. దీంతో అప్పుతీర్చడానికి పూనం తన ఆస్తులను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.

వెబ్దునియా పై చదవండి