చార్మి... వేశ్యలా ఎలా చేయాలో ఆమె దగ్గర నేర్చుకున్నదట...

మంగళవారం, 27 ఆగస్టు 2013 (13:08 IST)
WD
నటి చార్మి నటించిన చిత్రం 'ప్రేమ ఒక మైకం'. ఈ చిత్రం ఈ నెల 30న విడుదలవుతుంది. ఈ చిత్రంలో ఆమె వేశ్య పాత్రలో నటిస్తోంది. ఈ పాత్ర గురించి ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. ఈమె ఈ పాత్రను బాగా పోషించిందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఈ పాత్ర గురించి తెలిసిన సీనియర్‌ నటి సరిత ఆమెకు కొన్ని సలహాలు ఇచ్చిందట. గుప్పెడు మనసు, కోకిలమ్మ చిత్రాలతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. అయితే నటి చార్మికి సరిత గురించి ఇప్పటికి తెలిసింది. సరిత దగ్గర కొన్ని టిప్స్‌ కూడా తెలుసుకుంది.

ఎలాంటి పాత్రలు ఎలా చేయాలి. ఎటువంటి పాత్రలను ఎంచుకోవాలనే వివరాలన్నీ తెలుసుకుంది. మరి ప్రేమ ఒక మైకం తర్వాత తన ట్రెండ్‌ను మార్చుకుంటానని చెబుతున్న చార్మి... ఎటువంటి పాత్రలు పోషించనుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి