'నటసింహం' పక్కనంటే వాళ్లు పారిపోయారట... ఆమె మాత్రం చూపిస్తానని...

మంగళవారం, 27 ఆగస్టు 2013 (16:25 IST)
బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రానికి ఇంకా టైటిల్ పెట్టలేదనుకోండి. ఐతే ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే రామోజీ ఫిలింసిటీలో జరుపుకుని షెడ్యూల్‌ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం శివార్లలో షూటింగ్‌ జరుగుతోంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన నటించే హీరోయిన్‌ కోసం చాలామందిని వడపోశారు. ఎందుకనో నటసింహం ముందు తాము నటించలేమని చాలామంది చెబుతున్నారట. దాంతో ఇక్కడివారు లాభంలేదని బాలీవుడ్‌కు వెళ్ళి అక్కడ సోనాలి చౌహాన్‌ను పట్టుకొచ్చారట.

ఆమైతే పాత్రకు కరెక్ట్‌గా సరిపోతుందనీ, ఏరికోరి ఆమెను తీసుకురావడంపై బోయపాటి శ్రీను చెబుతున్నాడు. గతంలో ఆమె నటించిన సినిమాల్లో పాత్రలను వల్లెవేస్తూ, ఆమెకు మంచి ప్రశంసలు ఇస్తున్నాడు. మరి ఈ బిల్డప్‌ ఎలా ఉన్నా, బాలయ్య సరసన చూస్తేగానీ ఆమె గురించి సమాధానం చెప్పరు ప్రేక్షకులు.

వెబ్దునియా పై చదవండి