దేవీశ్రీని అందరూ వాయించేశారట... అంతే గొళ్లెం పడింది

మంగళవారం, 22 ఏప్రియల్ 2014 (21:36 IST)
WD
తనను ఏమనుకున్నా అది నెగెటివ్‌గా మారుతుందనే తొందరలో ఇటీవలే దేవీశ్రీప్రసాద్ బరస్ట్‌ అయ్యాడు. లెజెండ్‌ సినిమా రీ రికార్డింగ్‌ విషయం గురించి దర్శకుడు బోయపాటి శ్రీను తాను దగ్గరుండి దేవీ నుంచి ట్యూన్స్‌ రాబట్టుకున్నాననీ, ఇంకా ఏదో చెప్పబోతుండగా వెంటనే మైక్‌ అందుకుని దేవీశ్రీ చాలాసేపు క్లాస్‌ పీకాడు. తాను ఎవడో చెబితే వినే దౌర్భాగ్యపు పరిస్థితిలో లేనని స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. వేదికపై బాలకృష్ణ ఉన్నా.. ఆ విషయంలో కలుగచేసుకోలేదు.

అయితే రానురాను విషయం కొండంతగా మారింది. ఇండస్ట్రీలో చాలామంది దేవీశ్రీ దూకుడు తగ్గించుకుంటే బాగుంటుందనే మెసేజ్‌లు పంపించారు. బోయపాటి శ్రీనుకు ఇండస్ట్రీలో మంచి పట్టు ఉండటంతో వారంతా రియాక్ట్‌ అయ్యారనీ తెలుస్తుంది. ఇలాంటి డైలాగులు ఒక దర్శకుడి సక్సెస్‌ మీట్‌లో చెప్పడం సినీ అగ్ర దర్శకులకూ మండింది. వారు కూడా దేవీకి క్లాస్‌ పీకినట్లు సమాచారం. దర్శకుడు అనేవాడు అందరినీ చూసుకోవాలి. ఏదైనా ఉంటే తర్వాత చెప్పవచ్చు కానీ పబ్లిక్‌గా దర్శకుల్ని విమర్శంచడం దేవీ కెరియర్‌పై పడే ప్రమాదముంది.

వెబ్దునియా పై చదవండి