హైదరాబాద్‌లో పుట్టి, అమెరికాలో పెరిగి, చెన్నైలో మోడలింగ్ చేసి తిరిగి హైదరాబాద్‌లో హీరోయిన్‌గా మారిన అమ్మాయి ప్రియా ఆనంద్. లీడర్ సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. జర్నలిస్టుగా పాత్ర వేసి శభాష్ అనిపించుకుంది. తొలి చిత్రమైనప్పటికీ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకుంది. లీడర్ రిలీజ్ కాక ముందే మరో రెండు చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం ప్రియకే సాధ్యమైంది. ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీకోసం...