అల్లు అర్జున్‌పై కంఫర్ట్‌గా కూర్చున్నా... 'రేసుగుర్రం' శ్రుతి హాసన్‌ ఇంటర్వ్యూ

గురువారం, 17 ఏప్రియల్ 2014 (20:31 IST)
WD
గబ్బర్‌ సింగ్‌ చిత్రంతో ఒక్కసారిగా హిట్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న శ్రుతి హాసన్‌.. రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ సరసన నటించేస్తుంది. ఒకరకంగా మెగా ఫ్యామిలీ హీరోయిన్‌గా మారిపోయింది. తమిళంలోనూ, బాలీవుడ్‌లోనూ చిత్రాల్తో బిజీగా ఉన్న శ్రుతి హాసన్‌.. రేసుగుర్రంలో అల్లు అర్జున్‌ సరసన నటించి మెప్పించింది. ఈ చిత్రం ప్రమోషన్‌ సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన ఆమెతో వెబ్ దునియా తెలుగు చిట్‌చాట్‌...

మెగా ఫ్యామిలీకి లక్కీ హీరోయినా మీరు...?
లక్కీ, అన్‌ లక్కీ అనేది నమ్మను. సినిమాలో బాగా నటిస్తే లక్కీ, చేయకపోతే అన్‌ లక్కీ. నా సినిమా పెద్ద హిట్‌ అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను.

బన్నీతో చేయడం ఎలా అనిపిస్తుంది?
చాలా ఎంజాయ్‌ చేస్తూ చేశాను. బన్నీ ఎనర్జటిక్ హీరో. వర్క్‌లో సిన్సియర్‌ కూడా.

ఎమోషన్స్‌ బయట పెట్టకుండా ఎలా చేయగలిగారు?
నాకు మామూలుగా ఎమోషన్స్‌ బటయకు వచ్చేస్తుంటాయి. కానీ దర్శకుడు సురేందర్‌ రెడ్డి డిఫరెంట్‌ పాయింట్‌తో కామెడీ కలిపి నా చేత చేయించారు. అందులో ఓవర్‌ కామెడీ కూడా లేదు.

దీన్ని మీరు తెరపై చూసుకుంటే ఎలా ఫీలయ్యారు?
నా పెర్‌ఫార్మెన్స్‌ గురించి నేను జడ్జి చేయలేను. ప్రేక్షకులకు నచ్చిందంతే.. చాలా సంతోషంగా ఉన్నాను.

ఈ పాత్ర గురించి ఏదైనా హోంవర్క్‌ చేశారా?
చేయలేదు. దర్శకుడు ముందుగానే క్లియర్‌గా చెప్పారు. దాన్నిబట్టి ఫాలో అయ్యానంతే.

డాన్స్‌ పరంగా ఎలా అనిపించింది?
నాకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. 'రేసుగుర్రం'లో ఆ అవకాశం వచ్చింది. బన్నీతో పాటు చేయడం చాలా థ్రిల్‌గా ఉంది. అందులోనూ లుంగీ డాన్స్‌ కూడా చేయించాడు. ఆ ఐడియా.. బన్నీతోపాటు దర్శకుడి ఆలోచన కూడా.

WD
బన్నీపై కూర్చున్నారు. ఆ సన్నివేశం గురించి?
నేను చాలా కంఫర్ట్‌గానే కూర్చున్నాను. ఆ తర్వాత ఎఫర్ట్‌ అంతా బన్నీదే.

మీరు చాలా హాట్‌గా ఉన్నారు. సినిమాల్లోకి ఎందుకు వచ్చారని బన్నీ ఆడియో వేడుకలో అన్నారు?
దాన్ని నేను అంగీకరించను. మా కుటుంబమంతా సినిమానే జీవితం. నాకు చిన్నప్పుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌, సింగర్‌, నటి ఇలా ఏదో ఒకటి అవ్వాలనుండేది. ఒకరకంగా ఈ ఫీల్డులో ఉండటం గర్వంగానూ, చాలా హ్యాపీగానూ ఉంది.

ఈ చిత్రాన్ని కమల్‌ గారు చూశారా...?
ఇంకా చూడలేదు. ఆయన 'ఉత్తమ విలన్‌'లో బిజీగా ఉన్నారు.

మహేష్‌ బాబు సినిమాలో నటిస్తున్నారా?
లేదు. ఇంకా నిర్ణయం కాలేదు.

ఈ కథల నిర్ణయంలో తల్లిదండ్రుల బాధ్యత ఎంతవరకు ఉంటుంది?
నాన్నగారితోనూ, అమ్మతోనూ కథ గురించి చర్చిస్తాను. కానీ తుది నిర్ణయం నాదే.

అపెండిసైటిస్‌ ఆపరేషన్‌ అయిన కొద్ది గంటల్లోనే షూటింగ్‌కు వెళ్ళారే?
అవును. ఇదంతా మేనేజర్స్‌ ప్లాన్‌ చేసిందే. అప్పటికి గబ్బర్‌ సింగ్‌ కమిట్‌ అయ్యాను. కోలుకున్న వెంటనే షూటింగ్‌కు వెళ్ళిపోయాను.

మీకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్స్‌?
ఇండస్ట్రీ పీపుల్స్‌ మెచ్చుకోవడం..

కొత్త సినిమాలు?
తమిళంలో హరి దర్శకత్వంలో చేస్తున్నాను. ఇందులో విశాల్‌ కూడా చేస్తున్నాడు. బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌తో చేస్తున్నాను.

మీ తండ్రిగారి సినిమాలో నటించే ఆలోచన ఉందా?
అది నాన్నగారిని అడిగి తెలుసుకోవాలి.

ఇటీవలే ఓ ఆల్బమ్‌ చేశారనే వార్తలు వచ్చాయి?
ఇంకా చేయలేదు. షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్ల కుదరలేదు. మ్యూజిక్‌ అనేది నా డ్రీమ్‌.. టైం దొరికినప్పుడు తప్పకుండా చేస్తాను.

దర్శకుడు సురేందర్‌ రెడ్డి గురించి?
ఆయన కథ చెప్పినప్పుడే బాగా నచ్చింది. నా పాత్ర చాలా రిలాక్స్‌గా ఉంటుంది. ఒక్క ఎక్స్‌ప్రెషన్‌ ఉండదు. అన్నీ లోపలే అణచుకోవాలి. అదే స్పందన ఫీలింగ్‌.

ఫ్యాషన్‌ను ఫాలో అవుతారా?
లేదు. నాకిష్టమైన విధంగా నేనుంటాను అని చెప్పారు శ్రుతి హాసన్.

వెబ్దునియా పై చదవండి