జూన్ ద్వితీయార్థంలో పవన్ కల్యాణ్ "కొమరం పులి"

WD
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా ఖుషీ ఫేమ్ ఎస్.జె సూర్య దర్శకత్వంలో ఎస్.సత్యరామమూర్తి సమర్పణలో కనకరత్న మూవీస్ పతాకంపై ప్రముఖ ఫైనాన్షియర్, నిర్మాత శింగనమల రమేష్ బాబు నిర్మిస్తున్న భారీ చిత్రం కొమరం పులి నిర్మాణం శరవేగంగా జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ... పవర్‌ఫుల్ స్టోరీతో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో అన్‌కాంప్రమైజ్డ్ మేకింగ్‌తో రూపొందుతోన్న కొమరం పులి తెలుగు సినిమా స్టాండర్డ్స్‌ని పెంచేలా ఉంటుంది. అతి త్వరలోనే ఈ ఆడియోను సోనీ మ్యూజిక్ ద్వారా విడుదల చేసి జూన్ ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.

ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన నికిషాపటేల్ నటిస్తోంది. ఇంకా మనోజ్ బాజ్‌పాయ్, నాజర్, చరణ్ రాజ్, అలీ, బ్రహ్మాజీ తదితరులు నటించారు. నిర్మాత శింగనమల రమేష్ బాబు, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: ఎస్.జె.సూర్య

వెబ్దునియా పై చదవండి