'అధిపతి' కరెక్ట్‌ టైంలో వస్తున్నాడా?.. బాబుకు ఉపయోగపడుతుందా...?

మంగళవారం, 15 ఏప్రియల్ 2014 (20:13 IST)
WD
నారా రోహిత్‌ నటించిన అధిపతి సినిమా చాలాకాలం గ్యాప్‌ తీసుకుని ప్రస్తుతం ఎలక్షన్ల టైమ్‌ సమీపిస్తుండటంతో ముందుకు వస్తోంది. ఈ చిత్రం పూర్తిగా అవినీతి, లంచగొండితనం, రాజకీయనాయకులపై సెటైర్లు వేసి తీశారు. అందులో ఈ చిత్రాన్ని ప్లాన్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నెల 25న చిత్రం విడుదల కాబోతుంది. ముందుగానే నెట్‌లో చిత్రంలోని ట్రైలర్స్‌, డైలాగ్‌లు విడుదల చేస్తున్నారు. సమాజంలో అవినీతి ఎలా ఉందనేది ఇందులో డైలాగ్‌ రూపంలో చూపించారు.

రెడ్‌లైట్‌ పడినా రాంగ్‌గా వస్తే 100, లైసెన్స్‌ లేకపోతే 200, ఇంజనీరింగ్‌ సీటయితే 5లక్షలు, డాక్టర్‌ అయితే 50 లక్షలు.. ఇలా లంచాలు ఇస్తే చాలు అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. వీటన్నింటి ఇలాగే కంటెన్యూ చేస్తే దేశం నాశనం అయిపోతుందంటూ.. నారా రోహిత్‌ పలికే డైలాగ్‌లు హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే పొలిటికల్‌ సినిమా అంటే అంతా అవినీతిపై సెటైర్లే. ఇటువంటి కథనాలు ఇంతకుముందూ వచ్చాయి. శంకర్‌ కూడా మంచి సినిమాలు తీశాడు. మరి అవి ఏ మేరకు సమాజాన్ని ఉద్దరించాయి. మరి ఈ సినిమా చంద్రబాబుకు ఎలా ఉపయోగపడుతుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి