ఆర్య, సోనియా అగర్వాల్ (7/జి బృందావన కాలనీ ఫేం) హీరోహీరోయిన్లుగా, ఎస్. అనీష్ ఫిలింస్ బేనర్‌పై రూపొందుతోన్న చిత్రం "కాలేజీ డేస్". ఈ సినిమా పేరుకు "గోల్డెన్ డేస్" అనే ఉప శీర్షికను కూడా జోడించారు. తమిళంలో హిట్టయిన "ఒరుకల్లూరిన్కదై" అనే సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు.
కాలేజీడేస్‌లో ఉండే ఆనందం, అప్పటి స్నేహం చిరస్థాయిగా నిలిచివుంటుందని నిరూపించే కథాంశంతో, లవ్, కామెడీ, సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. కాలేజీ స్టూడెంట్స్ చుట్టూ నడిచే కథాంశం... అన్నిరకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
యూ సర్టిఫికేట్‌తో ఇప్పటికే చిత్ర తొలికాపీ సిద్ధమైందని నిర్మాతలు ఎస్.వేణుగోపాల్ రెడ్డి, చల్లా శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. ఈ సినిమా ఆడియోను మధుర ఎంటర్టైన్మెంట్ ఇప్పటికే మార్కెట్లోకి విడుదలైంది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.