"మహాయజ్ఞం" ట్రైలర్‌ను వీక్షించండి

శనివారం, 13 సెప్టెంబరు 2008 (17:12 IST)
WD
నాజర్, సీత, భానుప్రియ, చంద్రమోహన్, రామిరెడ్డి తదితరులు నటించిన చిత్రం "మహాయజ్ఞం". 20 ప్రింట్లతో 12న విడుదల కానున్న ఈ సినిమాకు క్లీన్ "యు" సర్టిఫికేట్ లభించిందని చిత్ర నిర్మాత రవీందర్ గుప్త తెలియజేశారు. ఈ చిత్రంలో సీనియర్ నటీనటుల మధ్య కృష్ణమారుతి అనే నూతన నటుడు చక్కగా నటించారని గుప్త పేర్కొన్నారు. వందేమాతరం శ్రీనివాస్ బాణీలు ఆకట్టుకున్నాయని, చక్కని సందేశాత్మకంగా ఈ సినిమాను మలిచామని చెప్పారు.

చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... వాస్తవ సంఘటనను కథగా ఎంచుకుని నిర్మించడానికి ముందుకు వచ్చిన నిర్మాతకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సెన్సార్ సభ్యుల ప్రశంసలందుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత ప్రేక్షకుల స్పందన చూరగొంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇంకా ఈ చిత్రానికి మాటలు... దానం వెంకట్రావ్, కెమెరా.. సురేందర్ రెడ్డి, ఎస్.డి.జాన్, సంగీతం... వందేమాతరం శ్రీనివాస్, ఎడిటింగ్.. వెంకటేశ్వరరావు. కృష్ణతోట దర్శకత్వం వహిస్తున్న "మహాయజ్ఞం" సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్‌ రూపంలో తిలకించండి.

వెబ్దునియా పై చదవండి