"చింతకాయలరవి"ని ట్రైలర్లో చూడండి

శుక్రవారం, 26 సెప్టెంబరు 2008 (16:38 IST)
"లక్ష్మీ", "ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే", "తులసి" వంటి సినిమాల విజయంతో హ్యాట్రిక్ హీరోగా మారిన వెంకటేష్ "చింతకాయల రవి"గా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కామెడీతో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.

లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాలో అనుష్క హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక రాజు ఒక రాణి ఫేమ్ యోగి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన తొలికాపీ త్వరలో సిద్ధమవుతుందని నిర్మాత నల్లమలుపు బుజ్జి వెల్లడించారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని అక్టోబర్ 1న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.

వెంకటేష్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపడా కథతో పూర్తి వినోదాత్మకంగా ఈ చిత్రముంటుందని నిర్మాత చెప్పారు. ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్‌ చేయనున్నామన్నారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా చక్కగా నటించిన చింతకాయల రవిని ట్రైలర్‌లో వీక్షించండి.

వెబ్దునియా పై చదవండి