"ఏకలవ్‌యుడు"ను ట్రైలర్లో వీక్షించండి

సూపర్ సెన్సేషనల్ హిట్ "నరసింహనాయుడు" చిత్ర నిర్మాత మేడికొండ మురళీకృష్ణ సమర్పణలో యూత్ హీరో ఉదయ్‌కిరణ్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం "ఏకలవ్‌యుడు".

శ్రీ వెంకట రమణ ఫిలింస్ పతాకంపై కె.ఆర్.కె. దర్శకత్వంలో, యువ నిర్మాత మేడికొండ అమర్‌చంద్ ప్రొడక్షన్ నెం-10గా నిర్మించిన "ఏకలవ్‌యుడు" సినిమా లవ్‌లీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కి మాస్‌ను ఆకట్టుకుంటోంది. అనిల్ కృష్ణ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమా ఆడియోకు శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా హీరో ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ... "ఏకలవ్‌యుడు" అనే డిఫరెంట్ టైటిల్‌తో... కథే ప్రధానంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిదన్నారు. ఒక కమర్షియల్ సినిమాలో ఉండాల్సిన అన్ని అంశాలు కరక్ట్ ప్లేస్‌మెంట్స్‌లో ఉండేలా డైరక్టర్ కె.ఆర్.కె. చాలా జాగ్రత్త తీసుకున్నారని చెప్పారు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించండి.

వెబ్దునియా పై చదవండి