దేవీ మూవీస్ పతాకంపై ఎన్.జె.రత్నావత్ నిర్మిస్తూ.. హీరో ఆకాష్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "స్వీట్ హార్ట్". ఇందులో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడు.
ఈ సినిమా గురించి ఆకాష్ మాట్లాడుతూ.. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారని తెలిపారు. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్ నిధి పాత్ర ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. డైసీ బోపన్న, సుహాసిని మిగిలిన ఇద్దరు హీరోయిన్లని వెల్లడించారు.
రాహుల్‌దేవ్, బ్రహ్మానందం, చలపతిరావు, సత్యం రాజేష్, బ్రహ్మాజీ, శివారెడ్డి, తదితరులు ఈ చిత్రంలో మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను ట్రైలర్ రూపంలో వీక్షించి ఆనందించండి