వెంకటేష్, ప్రియమణి, అనుష్కల "నాగవల్లి" ట్రెయిలర్

వెంకటేష్, అనుష్క, ప్రియమణి, విమలారామన్ ప్రధాన పాత్రధారులుగా శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై పి.వాసు దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ‘నాగవల్లి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన లోగో ఆవిష్కరణ రామానాయుడు స్టూడియోలో జరిగింది.

తన కెరీర్‌లో ఇదొక బెస్ట్ పిక్చర్‌గా నిలుస్తుందని హీరో వెంకటేశ్ అంటున్నారు. అదేవిధంగా ఈ చిత్రంలో తనది విభిన్నమైన పాత్ర అనీ, కన్నడంలో ఎంతటి విజయాన్ని సాధించిందో అంతకు మించిన విజయాన్ని తెలుగులో సొంతం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించి ట్రెయిలర్ మీకోసం...

వెబ్దునియా పై చదవండి