ప్రపంచంలో ధూమపాన ప్రియులు మిలియన్లకొద్ది ఉన్నారు. వీరిలో చాలామంది తమకున్న ధూమపానం అలవాటును మానేయాలనుకుంటూనే ఉంటారు. కాని మానలేకపోతుంటారు. దీనికి బ్రిటిషి మానసిక శాస్త్రవేత్తలు ధూమపాన ప్రియులపై పరిశోధనలు జరిపారు. వారిపై జరిపిన పరిశోధనల్లో తేలిందేంటంటే ధూమపానం చేసేవారు నిత్యం వ్యాయామం చేస్తుంటే వారిలో ధూమపానం చేయాలనే కోరికే పుట్టదని పరిశోధనకారులు తెలిపారు.
ధూమపానం చేయక మునుపు, ధూమపానం చేసిన తర్వాత వారి ముఖంలో వచ్చిన మార్పులను వారికి వారి వారి ఫోటోల ద్వారా చూపించడం జరిగింది. ఆ తర్వాత నిత్యం వ్యాయామం చేసిన తర్వాత వారిలో వచ్చిన మార్పును కూడా ఫోటోల ద్వారా వారికి చూపించడం జరిగిందని యూనివర్శిటి ఆఫ్ ఎక్సెటర్ పరిశోధకులు తెలిపారు.
FILE
తరచూ వ్యాయామం చేసిన తర్వాత దాదాపు 11 శాతం మందిలో ధూమపానం చేయాలన్న కోరిక తగ్గిందని, అలాగే వారు వ్యాయామం కొనసాగించడంతో వారిలోనున్న ఆ కోరిక పూర్తిగా తగ్గిపోయిందని తమ పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు.
FILE
శరీరం ఒత్తిడికి గురైనప్పుడు లేదా మానసికంగా ఒత్తిడి పెరిగినప్పుడు ధూమపానం చేయాలనిపిస్తుందని అదే క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే ధూమపానంపై మనసు పోవట్లేదని వారి పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు వివరించారు.