క్యాండీ, చాక్లెట్లు తింటున్నారా? ఐతే బరువు తగ్గుతారట!

శనివారం, 9 ఆగస్టు 2014 (17:49 IST)
చాక్లెట్లు, క్యాండీలు ఆరగించేవారు ఈ కథనం చదవాల్సిందే. వీటిని ఎక్కువగా ఆరగించడం వల్ల ఆరోగ్యానికి మేలేనని సర్వే చెబుతోంది. క్యాండీలు, చాకెట్లు తినడం ద్వారా ఆరోగ్యానికి కీడు చేసే రోగాలు దరిచేరవని లూజియానా స్టేట్ యూనివర్శిటీ అగ్రికల్చురల్ సెంటర్ నిర్వహించిన స్టడీలో తేలింది. క్యాండీలు, చాక్లెట్లను ఇష్టపడి తినే వారు బరువుకూడా తగ్గిపోతారని ఆ సర్వే తేల్చింది. 
 
లోయర్ బాడీ మాస్ ఇండిసెస్ (బీఎమ్ఐ) మరియు రక్తనాళ సంబంధిత వ్యాధులు, మెటబాలిక్ సిండ్రోమ్ వంటి రోగాలు రావని లూజియానా స్టేట్ యూనివర్శిటీ పరిశోధకులు కరోల్ ఒ నెయిల్ తెలిపారు. క్యాండీలను వినియోగించడం ద్వారా కెలరీలతో శరీరానికి శక్తి చేకూరడం, డైట్, న్యూటీన్, బరువు నియంత్రణ వంటివి జరుగుతాయి. శరీరానికి కావలసిన కెలరీలను క్యాండీలు అందిస్తాయని ఆ సర్వే వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి