ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూరపండు తరచుగా ఎక్కువగా తినాలి. ఎండా కాలం వడదెబ్బ తగలకుండా ఉండాలంటే, ఖర్జూరపండును రాత్రుళ్లు నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తాగితే వడదెబ్బ నుండి ఉపశమనం కలుగుతుంది.
పెద్ద పేగులోని సమస్యలకు ఖర్జూర టానిక్ చక్కగా ఉపయోగపడుతుంది. గొంతునొప్పి, మంట, జలుబుకు ఈ పండు గుజ్జు లేదా సిరప్ మంచి మందుగా పనిచేస్తుంది. డయేరియా, మూత్రాశయ సమస్యల్ని నివారించేందుకు కాండం నుంచి తీసిన జిగురును వాడితే మంచిది. చెట్టువేళ్లను నూరి పంటిలో పెట్టుకుంటే పంటినొప్పి తగ్గుతుంది. మూత్రపిండాలలో రాళ్లు కరగాలంటే కర్జూరపండు తరచుగా తినాలి.