కారు నడుపుతూ నిద్రపోతే ఆ బెల్టు అరుస్తుంది...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (14:43 IST)
వాహనం నడిపేవారు నిద్రమత్తులో జారుకుంటే ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రతి సమస్యకు పరిష్కారం వుంటుంది కదా. అదే ఇక్కడ కూడా కనుగొనబడింది. అదే డోజింగ్ అలెర్ట్ సీట్ బెల్ట్. ఇందులో డ్రైవర్ సీటు బెల్టుకు, సీట్ కవరకూ అమర్చిన సెన్సర్లు వాహనం నడిపేవారి శ్వాసరేటు, గుండె కొట్టుకునే వేగం కొలుస్తుంటాయి. 
 
నిద్రలోకి వెళ్తున్న వారిలో శ్వాస రేటు, గుండె కొట్టుకునే వేగం రెండూ నెమ్మదిస్తాయి. అలా వాటిలో స్వల్ప తేడా వచ్చినా సీటు బెల్టులో అమర్చిన అలారం మోగుతుంది. దీంతో వాహన చోదకులు ప్రమాదాన్ని తప్పించుకునే అవకాశం దొరుకుతుంది.

వెబ్దునియా పై చదవండి