అబ్బ ఈ పొట్టతో చాలా ఇబ్బందిగా ఉంది... ఆకర్షణ అంతా పోతోంది. ఇన్ షర్ట్ చేస్తే, అంతా అదోలా చూస్తున్నారు. పైగా కడుపులో నిత్యం ఏదో ఇబ్బంది అని బాధపడుతున్నారా? లైపోసక్షన్ ఆపరేషన్ చేయించుకుని ఇక పొట్ట తగ్గించుకోవాల్సిందే అని ఆలోచిస్తున్నారా? అలాంటివేమీ వద్దు... ఇలా చేయండి... 30 రోజుల్లో మీ పొట్ట కరిగిపోతుంది. దీనిని ప్లాంక్ ఎక్సర్‌సైజ్ అంటారు.
ఇలా బోర్లా పడుకుని మోచేతులు రెండూ ఇలా ఉంచి, కాలి బొటన వేలిపై పైకి లేచి... 4 నుంచి 6 నిమిషాల పాటు ఇదే భంగిమలో ఉండండి. మీ పొట్ట కండరాలు, నడుము, కాళ్ళ కండరాలపై అనూహ్యమైన వర్కవుట్ జరిగిపోతుంది. కొవ్వంతా కరిగిపోయి... కండరాలు బలిష్టంగా మారిపోతాయి. సరిగ్గా ఇలా నెల రోజులు క్రమంతప్పకుండా చేసి చూడండి... మీ పొట్ట మాయం... మీలో ఉత్సాహం అమితం. పైగా ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పొట్ట తగ్గించుకోవచ్చు. అంతేకాదు... బీపీ, షుగర్ వంటివి కూడా ఈ ప్లాంక్ కసరత్తు వల్ల కంట్రోల్ అయిపోతాయి. ట్రై చేసి చూడండి.