శరీరంలోని భాగాలన్నీ చక్కని సమన్వయంతో పనిచేయాలంటే శక్తి, ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలూ ఎంతో అవసరం. ఈ ఐదు రకాలూ వేరుసెనగపప్పుల్లో పుష్కలంగా లభ్యమవుతాయి. ఎ, బి, సి, ఇతో కలిపి మొత్తం 13 రకాల విటమిన్లూ ఐరన్, కాల్షియం, జింక్, బోరాన్... వంటి 26 రకాల కీలక ఖనిజాలూ వీటిల్లో ఉన్నాయి.
2. పెరిగే పిల్లలకూ గర్భిణులకూ పాలిచ్చే తల్లులకూ ఇవి ఎంతో మంచివి. వేయించిన తాజా గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుందట. హెపటైటిస్, ట్యుబర్‌క్యులోసిస్ వంటివి రాకుండా ఉంటాయి.
4. యాంటీఆక్సిడెంట్లకు ఇవి మంచి నిల్వలు. వేయించిన పల్లీల్లో అయితే వీటి శాతం బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీల్లోకన్నా ఎక్కువ. క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే ఇంకా ఎక్కువని ఇటీవల పరిశోధనల్లో తేలింది. ఎందుకంటే ఇందులోని పి-కౌమారిక్ ఆమ్లం వేయించినప్పుడు 22 శాతం పెరుగుతుందట.