సాధారణంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మంచి పోషకాలు అందించేది గుడ్డు. పైగా, చికెన్, మటన్ కంటే అతి తక్కువ ధరకు మార్కెట్‌లో లభ్యమయ్యేది గుడ్డు. అందుకే ఈ గుడ్డును ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే, గుడ్డును ఉడకబెట్టిన తర్వాత చాలా ఆలస్యంగా ఆరగిస్తుంటారు.
గుడ్డును నూనెలో ఫ్రై చేసుకుని తినడం కంటే.. ఉడకబెట్టి ఆరగిస్తేనే పోషకాలు అందుతాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి చాలామంది ఆలస్యంగా ఆరగిస్తుంటారు. వాస్తవానికి ఆలా చేయరాదు. అలాచేస్తే గుడ్డుపై వైరస్, బ్యాక్టీరియాలు చేరి అవి త్వరగా కలుషితమయ్యే (చెడిపోయే) అవకాశం ఉంది.