తిరుమల తిరుపతి దేవస్థానం గురువారం సాయంత్రం మన్మథ నామ సందర్భంగా తెలుగు పంచాంగాన్ని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట విడుదల చేశారు. వేదిక్ క్యాలండర్ అనేది తిథి, వార, నక్షత్ర, కారన, యోగా అనే వాటిని అనుసరించి తయారు చేసినదని ఈవో సాంబశివ రావు తెలిపారు. ఇది జీవిన విధానానికి ఒక క్రమశిక్షణతో కూడినదని చెప్పారు. ఇవన్నీ కూడా సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాలపై ఆధారపడి ఉంటుంది.
మన్మథ నామ యేడాది అన్ని ఆనందాలను తీసుకువస్తుందని చెప్పారు. వేదిక్ పంచాంగం రెండు భాషలలో ఉంటుందని చెప్పారు. తెలుగు, తమిళ భాషలలో 75 వేల ప్రతులను ముద్రించినట్లు చెప్పారు. వీటిని తిరుమలలోనూ, ఇతర టీటీడీ సంస్థలలో విక్రయిస్తామని చెప్పారు. తెలుగు కాలెండర్ రూ. 50లకు, తమిళ కాలెండర్ రూ. 45 లకు విక్రయిస్తామని చెప్పారు.