స్లిమ్‌గా ఉండాలంటే రోజూ ఓ కప్పు పెరుగు తింటే చాలు...

శుక్రవారం, 23 ఆగస్టు 2019 (15:14 IST)
స్లిమ్‌గా ఉండేందుకు మనం చాలా ప్రయత్నాలు చేస్తుంటాం. కొంత మంది ఆహారం తక్కువగా తీసుకుంటారు. కడుపు మాడ్చుకుంటారు. కానీ అలా చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆహారం ఎక్కువగా తీసుకోకపోయినా పౌష్టికాహారం తింటే చాలా మంచిది. అధిక బరువు తగ్గాలనుకునే వారు పెరుగు తినవచ్చు. 
 
పెరుగు తింటే స్థూలకాయం వస్తుందని చాలా మంది అపోహ. కానీ అది పొరపాటు. ప్రతిరోజూ కప్పు పెరుగు తీసుకుంటే అధిక బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో ఉండే క్యాల్షియం శరీరంలో కొవ్వును తగ్గించి స్లిమ్‌గా ఉండేలా చేస్తుంది. హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. 
 
పెరుగులోని ప్రోటీన్స్ శరీరానికి కావలసిన పోషక విలువలను అందిస్తాయి. పెరుగును తరచుగా తీసుకుంటే ఇతర చిరుతిండి పదార్థాలు తీసుకోవాలనిపించదని పరిశోధకులు చెబుతున్నారు. చిరుతిండి పదార్థాలు ఎక్కువగా తినడం వలన అధికంగా బరువు పెరుగుతారు, దాంతో కడుపు కూడా పెరుగుతుంది. 
 
కనుక పెరుగును తప్పకుండా డైట్‌లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మంచిది. 300 గ్రాముల పెరుగులో 200 గ్రాముల క్యాల్షియం ఉంటుందని చెప్తున్నారు. ఈ క్యాల్షియం కడుపులోని కొవ్వును బయటకు పంపుటకు ఉపయోగపడుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు