నువ్వులు. ఇవి శరీరానికి అందవలసిన ప్రోటీన్‌కి మంచి మూలం. ఈ నువ్వుల్లో ఇరవై శాతం మేర అధిక-నాణ్యతతో కూడిన అమైనో ఆమ్లాలు ఉంటాయి. నువ్వులు ఆహార పదార్థాల ద్వారా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. నువ్వులు మెగ్నీషియం, ఇతర పోషకాలను కలిగి ఉంటాయి కనుక ఇవి మధుమేహాన్ని ఎదుర్కోవటానికి దోహదపడుతాయి.
నలుపు రంగులో వుండే నువ్వుల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత, బలహీనతతో బాధపడుతున్న వారికి మేలు చేస్తాయి. నువ్వుల గింజల నూనె అథెరోస్క్లెరోటిక్ గాయాలను నివారిస్తుంది, అంతేకాదు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. నువ్వులు కొలొరెక్టల్ ట్యూమర్‌ల ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి, తద్వారా కొలొరెక్టల్ క్యాన్సర్‌ను నివారిస్తాయి.
నువ్వుల్లోని రాగి యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్ వ్యవస్థలకు కీలకమైన ఖనిజం, కనుక ఆర్థరైటిస్‌తో సంబంధం ఉన్న నొప్పి, వాపును ఇది తగ్గిస్తుంది. నువ్వుల గింజలలో ఉండే మెగ్నీషియం శ్వాసనాళాల దుస్సంకోచాలను నివారించి ఆస్తమా, ఇతర శ్వాసకోశ రుగ్మతల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. నువ్వుల గింజలలో జింక్ ఉంటుంది, ఇది ఎముక ఖనిజ సాంద్రత- ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతుంది.