ఇప్పుడు పాకిస్తాన్ దేశంలో ఓ ఇండియన్ పొలిటీషియన్ ను హీరో అయిపోయారు. ఇంతకీ ఎవరయ్యా ఆయన అంటే... ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆయన గురించి పాకిస్తాన్ దేశంలో సామాజిక మాధ్యమాల్లో #pakstandswithkejriwal అనే ట్యాగు లైనును ఓ రేంజి ట్రెండింగుతో ముందుకు తీసుకెళుతున్నారు. కేజ్రీవాల్ అడిగినది ఏమంటే... భారత సైన్యం చేసిన సర్జికల్ దాడులకు సంబంధించిన వీడియోలను బయటపెట్టాలనేదే.
కేజ్రీవాల్ ఆ వీడియోను అలా గాల్లోకి వదిలారో లేదో పాకిస్తాన్ పట్టేసింది. పాకిస్తాన్ మీడియా ఆయనను పెద్ద హీరో కింద మార్చేసింది. సోషల్ మీడియాలో అయితే ఆయనను హీరోగా చేస్తూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్ప భారతదేశంలో మిగిలినవారంతా భారత ప్రధాని మోదీ, ఆర్మీ చేతుల్లో ఫూల్స్ అయ్యారంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.