ఉగ్రవాద నిర్మూలనకు పాక్ కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అమెరికా పాక్‌కి స్పష్టం చేసింది. జైషే మహ్మద్, లష్కరే తోయిబా లాంటి ఉగ్ర సంస్థలను సంపూర్ణంగా మట్టుబెట్టాల్సిన అవసరం ఉందని వైట్‌హౌజ్ అధికారులు వెల్లడించారు.
మరోసారి భారత్‌పై ఉగ్రదాడి జరిగితే, మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని, అలాగే రెండు దేశాల మధ్య శాంతి భద్రతలు విషయంలో ప్రమాదం తలెత్తుతుందని ఆమెరికా అధికారి చెప్పారు. బాలాకోట్ దాడి తర్వాత పాకిస్తాన్ ఉగ్రవాదంపై ఏమైనా చర్యలు తీసుకుందా అన్న ప్రశ్నకు అమెరికా అధికారులు ఈ విధంగా సమాధానమిచ్చారు.. ఉగ్రవాద చర్యల నిర్మూలనకు పాకిస్థాన్ చేపడుతున్న చర్యలను ఇప్పుడు అంచనా వేయలేమని, ప్రస్తుతానికి ఉగ్ర సంస్థల ఆస్తులను మాత్రం సీజ్ చేసినట్లు ఆయన స్పష్టం చేసారు.
అలాగే కొందరు ఉగ్రవాదులను కూడా అరెస్ట్ చేసి, జైషే స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోందని చెప్పారు. పాకిస్తాన్ ఇంకా కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, అందుకోసం అమెరికా అంతర్జాతీయ దేశాలతో కలిసి పాకిస్తాన్‌పై ఒత్తిడి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.