బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం రసాయన దాడి.. తాగునీటిలో విషం?

బుధవారం, 31 ఆగస్టు 2016 (11:29 IST)
బలూచిస్థాన్‌లో పాకిస్థాన్ సైన్యం రసాయన దాడి జరిపినట్టు వార్తలు వస్తున్నాయి. భారత స్వాతంత్ర్యం దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బలూచిస్థాన్ ప్రజల దుస్థితిని ప్రస్తావించిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నుంచి పాకిస్థాన్ సైన్యం ఇక్కడ మరింత దారుణంగా వ్యవహరిస్తోంది. ఉద్యమకారులు చెబుతున్న సమాచారం ప్రకారం పాకిస్థాన్ సైన్యం బలూచిస్థాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నవారిపై రసాయనిక ఆయుధాలు ఉపయోగించింది. 
 
ప్రజలకు సరఫరా చేసే తాగునీటిలో విషం కలిపినట్లు భావిస్తున్నారు. బలూచ్ ప్రజలను జంతువుల కన్నా హీనంగా పరిగణిస్తోంది. పాక్ సైన్యం రసాయనిక ఆయుధాలను వాడినట్లు వెలుగులోకి రావడంతో జర్మనీలో నివసిస్తున్న బలూచీలు పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. 

వెబ్దునియా పై చదవండి