క్రెడిట్ కార్డుల ద్వారా భారీగా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేకపోయిన ఓ మహిళ తన ముఖాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మార్చేసుకుంది. అయితే ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చైనాకు చెందిన 59 ఏళ్ల జూ నజూవాన్ అనే మహిళ.. క్రెడిట్ కార్డు ద్వారా రుణాలను తీసుకుని జల్సా చేసింది. విందులు, వినోదాల పేరిట ఆడంబరంగా జల్సా చేసింది.