సాంకేతిక విప్లవం పుణ్యమాని రోజుకో వెబ్సైట్ పుట్టుకొస్తోంది. అలా పుట్టుకొచ్చే వెబ్సైట్లు మనుగడ కొనసాగించాలంటే పబ్లిసిటీ ఉండాలి. ఇందుకోసం లండన్‌కు చెందిన లైఫ్‌స్టైల్ వెబ్సైట్ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఓ స్ట్రీట్ డ్యాన్సర్‌తో ఈ తరహా ప్రచారం చేయించింది. తమ వెబ్సైట్ గురించి నలుగురికీ తెలిసేందుకు.. ఆ అమ్మాయితో పబ్లిక్‌గా దుస్తులు విప్పేయించింది. అంతేనా తాను దుస్తులు విప్పడాన్ని సొంగకార్చుకుంటూ చూస్తూ నేత్రానందం పొందిన వారి నుంచి అభిప్రాయసేకరణ జరిపించారు. ఇదంతా లండన్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే..
లండన్‌లోని అండర్ గ్రౌడ్ మెట్రో రైళ్లు నిత్యం ఎంతో రద్దీగా ఉంటాయి. అయితే, గత సోమవారం మాత్రం ఒక యువతి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకునేందుకు చిన్నపాటి ట్రిక్కును పాటించింది. పైగా ఆమె ఓ స్ట్రీట్ డ్యాన్సర్. సోమవారం ఉదయం రష్ హవర్లో పశ్చిమ లండన్ ప్రాంతంలో ట్రైన్ ఎక్కిన ఆ యువతి... తన శరీరంపై ఉన్న ఒక్కో వస్త్రాన్ని విప్పేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచింది. చివరకు లోదుస్తులు మాత్రమే ఉంచుకుని పోల్ డ్యాన్స్ చేసింది. దీంతో అందరూ ఆమెను కన్నార్పకుండా ఆమెనే చూస్తుండిపోయారు.
అయితే ఆమెకు మతి భ్రమించి ఇదంతా చేసిందనీ ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, ఆ యువతి అలాంటిది కాదనీ, అదంతా ఓ పబ్లిసిటీ గిమ్మిక్కు కాదనీ, యూకేకు చెందిన ఓ లైఫ్‌స్టైల్ వెబ్సైట్ చేసిన ప్రచారపు స్టంట్ అని తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోయారు. ఆ యువతి డ్యాన్స్ చేయడం పూర్తయిన తర్వాత ఒక పెన్ను, పేపర్ తీసుకని అందరి వద్దకూ వెళ్లి సదరు వెబ్సైట్ గురించి నాలుగు వాక్యాలు రాయమని అడిగింది. దీంతో ఆ ట్రైన్‌లోని వారంతా ఈ అమ్మడి రిక్వెస్టు కాదనలేక వారి అభిప్రాయాలు రాసిచ్చారు. ఇదో రకం పబ్లిసిటీ పిచ్చి.