తూర్పు కాంగో దేశంలో మళ్లీ ఎబోలా కేసు ఒకటి నమోదైంది. ఆ రాష్ట్ర వైద్య శాఖామంత్రి శుక్రవారం ఈ విషయాన్ని వెల్లడించారు. గత ఐదు నెలల తర్వాత ఈ కేసు నమోదైంది. ఈ ఎబోలా వైరస్ కారణంగా గత 2018-20 మధ్య కాలంలో తూర్పు కాంగోలో 2,200 మందికి పైగా మరణించారు. ఈ యేడాది ఈ వైరస్ ధాటికి ఇప్పటికే కొందరు చనిపోయారు.
కాంగో యొక్క బయోమెడికల్ లాబొరేటరీ నుండి వచ్చిన అంతర్గత నివేదిక ప్రకారం, బెని యొక్క జనసాంద్రత కలిగిన బుట్సిలి పరిసరాల్లోని పసిపిల్లల పొరుగువారిలో ముగ్గురు కూడా గత నెలలో ఎబోలాకు సంబంధించిన లక్షణాలను కనిపిస్తున్నాయి. కానీ ఈ ప్రాంత వాసులు ఎబోలా వైరస్ పెద్దగా అవగాహన లేకపోవడంతో పెద్దగా పట్టించుకోవడం లేదు.