భూమిని పోలిన మరో గ్రహం కోసం శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. మనకు అతిదగ్గరగా కనిపించే ఆల్ఫా సెంచురీ నక్షత్ర మండలంలో భూమిని పోలిన గ్రహాలు ఉన్నట్లు కాలిఫోర్నియా వర్శిటీకి చెందిన సైంటిస్ట్ ఫిలిప్ లూబిన్ వెల్లడించారు. ఇప్పటివరకు కనిపెట్టిన 4వేల కొత్త గ్రహాల్లో సుమారు 20 గ్రహాల్లో నీరు ఉండవచ్చునని భావిస్తున్నట్లు తెలిపారు.