ఆస్పత్రి పైకప్పుపై మృతదేహాలు.. 500 వరకు వుంటాయి.. ఎలా వచ్చాయి?

శనివారం, 15 అక్టోబరు 2022 (15:01 IST)
పాకిస్తాన్‌లోని ఓ ఆస్పత్రి పైకప్పుపై మృతదేహాలు కనిపించడం సంచలనం రేపింది. ఈ ఘటన పంజాబ్ నిష్టర్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆసుపత్రి పైకప్పు నుండి బయటపడిన మృతదేహాల సంఖ్య 500 వరకు ఉంటాయని తెలుస్తోంది.

అయితే, ఇవి ఎవరి మృతదేహాలు.. ఆసుపత్రి పైకప్పుపై ఇంత భారీ సంఖ్యలో మృతదేహాలు ఎక్కడ నుండి వచ్చాయనే అంశాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

ఈ మృతదేహాల నుంచి అవయవాలను అక్రమంగా తరలించారని.. లేదంటే వైద్య పరీక్షల కోసం మృతదేహాల అవయవాలను విడదీసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఆసుపత్రి పైకప్పుపై కనిపించిన ఈ మృతదేహాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు ఈ వీడియో చూసి భయబ్రాంతులకు గురవుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు