గర్భవతిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదేంటి..? గర్భవతిపై కేసు నమోదు చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది అనుకుంటున్నారు కదూ.. ఐతే చదవండి. బాలల హక్కులకు విరుద్ధంగా ఆమె గర్భవతి కావడమే ఇందుకు కారణమని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మెకంజీ లీఫ్ గఫే అనే 19 ఏళ్ల వయసున్న గర్భవతి అయిన యువతి హాస్పిటల్కు వెళ్లింది. గర్భిణీలకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న ‘మెడికేయిడ్’ అనే పథకంలో పేరు నమోదు చేయించుకుంది.